అమెరికా తెలుగు సంఘం వారు పదమూడవ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక కోసం రచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటిల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితల నుండి ఈ క్రింది సాహితీ ప్రక్రియల్లో రచనలు ఆహ్వానిస్తున్నారు.
1. కథలు
2. కవిత్వం(వచన కవిత్వం, ఛందోబద్దమైన కవిత్వం)
3. వ్యాసాలు/గల్పికలు/వ్యంగ రచనలు/లేఖలు/పేరడీలు
పోటీల నిబంధనలు, రచయితల సూచనలు:
- రచయితలు పైన పేర్కొన్న ఏ విభాగానికైనా తమకు నచ్చిన ఇతివృత్తం ఎన్నుకోవచ్చును. తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని, అన్ని తరాల విభిన్న ఆలోచనా రీతుల్ని , సమాజ, ఆచార వ్యవహార స్థితిగతుల్ని ప్రతిబింబిస్తూ రాసే రచనలకు పెద్దపీట వేయబడుతుంది.
- ఉత్తమ రచనలకు $116 బహుమతితో పాటు ఆటా జ్ఞాపిక అందజేయబడుతుంది. బహుమతి ప్రధానం జూలై 3,4,5 తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగబోయే ఆటా వార్షికోత్సవ మహాసభలలో జరుగుతుంది.
- బహుమతి పొందిన రచనలు, సాధారణ ప్రచురణకు ఎంపిక చేయబడిన రచనలను ఆటా ప్రత్యేక సంచికలో ప్రచురించడం జరుగుతుంది.
- రచనలు చేరవలసిన ఆఖరి తేది మార్చి 30,2014. ఈ తేదీలోపు కంటే ముందే, వీలైనంత త్వరగా పంపగలిగితే మరీ మంచిది.
- కధలు: కధల నిడివి చేతి వ్రాతలో పది పెజీల లోపు, టైపింగ్ లో ఐదు పేజీల లోపు ఉంటె బావుంటుంది.
- కవిత్వం: కవిత చేతి వ్రాతలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది. ఆదునిక కవిత, ఛందోబద్ధమైన పద్యకవిత్వం, ఇతర కవితా ప్రక్రియలూ అన్నీ ఆమోదయోగ్యమే.
- వ్యాసాలు, గల్పికలు, వ్యంగ రచనలు, పేరడీలు, లేఖలు: చేతి వ్రాతలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది.
- రచయితల యొక్క అముద్రిత స్వీయ రచనలు మాత్రమే స్వీకరించబడతాయి. అనువాదాలు, అనుసరణలు, అనుకరణలు అంగీకరించబడవు. బ్లాగులు, వెబ్ సైట్స్, వెబ్ పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించబడ్డ రచనలు పరిగణింపబడవు. ఈ విషయాలను ధృవీకరిస్తూ హామీపత్రం జత చేయాలి.
- రచనలపై సర్వాధికారాలు రచయితకే చెందుతాయి. కాని, రచయితలు తమ రచనలను ఆటా ప్రత్యేక సంచికలో ప్రచురించే లోపు ఇంకెక్కడా ప్రచురించవద్దని మనవి.
- రచనల్ని యూనికోడ్ ఫాంట్స్ లో పంపాలి. ఒకవేళ మీకు యూనికోడ్ లో టైపు చేసే సౌకర్యం లేకపోతే మీరు మీ రచనలను స్కాన్ చేసి PDF ఫైల్స్ పంపించవచ్చు. దయచేసి వీలైనంత వరకు యూనికోడ్ లో టైపు చేసి పంపించగలరని కోరుతున్నాం. రచనను ఈమెయిలులో రాసి పంపవచ్చు, లేదా ఈమెయిలుకు జోడింపుగా టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో కూడా పంపవచ్చు. రచనలు పంపే విషయంలో మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ క్రింది ఈమెయిల్ అడ్రసుకు మీ ప్రశ్నలు పంపించండి. మేము సాధ్యమైనంత త్వరలో మీకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.
- కనీసం ఐదుగురు న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు. న్యాయనిర్ణయం అంతా తగిన నిబద్ధత, కొలబద్దల ఆధారంగానే జరుగుతుంది. విజేతల నిర్ధారణలో అన్ని విషయాలలోనూ నిర్వాహకులదే అంతిమ నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
- రచనలు పంపవలసిన ఈమెయిలు:souvenir@ataconference.org . ఈమెయిలు లో మీ పూర్తి పేరు, కాంటాక్ట్ నంబరు, చిరునామాలతో పాటు ఒక పేజీకి మించకుండా మీ నేపధ్యం కూడా పంపించడం మరచి పోవద్దు.