Karunakar R. Madhavaram - President
ఆటా మిత్రులందరికీ ,
"శ్రీ జయ నామ సంవత్సర ఉగాది మరియు శ్రీ రామ నవమి" శుభాకాంక్షలు.
మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, తెలుగు వారసత్వాన్ని ప్రోత్సహించటం అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అతి ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఈ అతి ప్రధాన లక్ష్యాన్ని ప్రోత్సహించడానికి ఆటాకు ఉన్న వేదికలలో ఒకటి ఆటా ద్వైవార్షిక సదస్సులు. 13వ ఆటా తెలుగు మహాసభలు మరియు యువ సమ్మేళనం ఫిలాడేల్ఫియా మహానగరం లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటరులో జూలై 3 నుండి 5 వరకు జరుగుతుంది. మీరందరూ వచ్చి ఈ గొప్ప వేడుకలో పాల్గొనవలసిందిగా మీ అందరినీ మేము ఆటా తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మన సంస్కృతి, సాంప్రదాయాలను, వారసత్వాలను అమెరికాలో ప్రదర్శించడానికి మరో తరుణం ఇది. ఈ సదస్సులో పాల్గొనేందుకు మిమ్మల్ని ఆటా తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన తెలుగు సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వాన్ని అమెరికాలో చాటాల్సిన సందర్భం ఇది. ఇటువంటి సదస్సులను అనితరసాధ్యంగా నిర్వహించే సామర్థ్యం ఉన్న ఆటా మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ దిలావరి వ్యాలి (టిఎజిడివి)తో కలిసి నిర్వహిస్తున్న ఈ మెగా సదస్సుకు మిమ్మల్ని ఫిలాడేల్ఫియా కు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సదస్సుకు విద్య, సాహిత్యం, వినోదం, ఆధ్యాత్మికం, సాంస్కృతిక ప్రదర్శనలు సహా ఇంకా ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో మీకు ఫిలడేల్ఫియాలో స్వాగతం పలకడానికి ఆటా సర్వసన్నద్ధం అయింది.
ఆటా అద్యక్షులు కరుణాకర్ మాధవరం నాయకత్వంలోని ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, ధర్మ కర్తలు, కార్యనిర్వాహక కమిటీ తోపాటు కన్వీనర్, పర్మేష్ భీమ్‌రెడ్డి, కోఆర్డినేటర్, భువనేష్ బూజల, కో-కన్వీనర్, మాధవ్ మోసర్ల, స్థానిక కోఆర్డినేటర్, కృష్ణ ద్యాప, కాన్ఫరెన్సు డైరెక్టరు, బలవంత్ కొమ్మిడి, కాన్ఫరెన్సు కార్శదర్శి, అనంత పజ్జూర్, అడ్‌హక్ కమిటీ, సలహా సంప్రదింపుల కమిటీ మరియు వివిధ కాన్ఫరెన్సు కమిటీలతో కూడిన 13వ ఆటా కాన్ఫరెన్సు టీమ్ ఈ భారీ వేడుకను విజయవంతం చేయడానికి కార్యక్రమాలు మరియు ఏర్పాట్లకన్నింటికీ తుది మెరుగులు దిద్దుతున్నాయి. అమెరికా మరియు ప్రపంచంలోని ఇతర భాగాలలో స్థిరపడిన తెలుగుజాతి యొక్క అన్ని తరాల వ్యక్తుల మనస్సులకు హత్తుకునేలా, మొత్తం కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విందు, వినోద, క్రీడా, సాహిత్య, సమ్మేళనాలు, కార్యకలాపాలు ఉన్నాయి. వీటన్నిటి సారాంశం అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో స్థిరపడిన తెలుగువారి సంస్కృతీ, సాంప్రదాయాల వారసత్వాన్ని తరువాతి తరాలకు అందజేయడమే.
ఈ సదస్సు జులై 3న, దాతలు మరియు అమెరికాలో, భారతదేశం లో వివిధ రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదిగి పురస్కారాలు అందుకున్నతెలుగువారి గౌరవార్థం ఇచ్చే రాత్రి విందుతో ఈ వేడుక శుభారంభం అవుతుంది. గతంలో చేసినట్లే, ఈ సంవత్సరం కూడా బ్యాంక్విట్ ఈవెంట్లో భాగంగా జరిగే వినోద కార్యక్రమంలో విశిష్ట ప్రేక్షకుల సమక్షంలో అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు సహజ ప్రతిభను ప్రోత్సహించడానికి మరియు ప్రదర్శించడానికి చేస్తున్న ప్రయత్నానికి ఆటా గర్వపడుతున్నది.
ఆటా 2014 కాన్ఫరెన్సుకే ప్రత్యేకమైన విలక్షణ ప్రారంభోత్సవ వేడుకతో ప్రారంభం అవుతాయి. ప్రత్యేక ఆరంభ కార్యక్రమంతో ప్రారంభమై రోజంతా వివిద కార్యక్రమాలతో సదస్సు ఆద్యంతం సభికులను ఆకట్టుకునే అనేక కార్యక్రమాలు ఉంటాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ సందేశాలను ఇస్తారు. ఈ కార్యక్రమంలో భారత దేశం నుంచి వచ్చిన అతిథులు, జాతీయ ప్రతినిథి బృందం, అలాగే న్యూయార్క్, న్యూజెర్సీ, ఆతిథ్య నగరపు విశిష్ట అధికారుల ప్రతినిధులతో (పెన్సిల్వేనియా ) నుంచి వచ్చిన అధికారిక ప్రతినిధి బృందం కూడా పాల్గొంటుంది. ఆ తరువాతి రెండు రోజుల్లో గతంలో మాదిరిగానే తెలుగు ఔన్నత్యాన్ని చాటి చెప్పే వివిధ కార్యక్రమాలతో సదస్సు అలరారుతుంది. అలాగే అమెరికాలో తెలుగు టాటెంట్ ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నది ఆటా.
మధ్యాహ్నపు కార్యకలాపాలలో గానంలో "జుమ్మంది నాదం" మరియు నాట్యంలో "సయ్యంది పాదం" సెమీ-ఫైనల్ పోటీలు ఉంటాయి. వీటికి అదనంగా, మీరు పాల్గొనడానికి ఉత్సాహపడే మరియు వివిధ అంశాలను గురించి తెలుసుకునే అవకాశం ఉండే పలు ఫోరమ్స్ మరియు సెమినార్లు కూడా ఉంటాయి. మీ గ్రామం, మండలం లేక జిల్లాకు వారి సమస్యల పరిష్కారానికి మీరు ఎలా సహాయపడగలరు అన్న సందేశాన్ని మీరు అందించగలరేమో చూడటానికి ప్రాంతీయ అభివృద్ధి ఫోరమ్స్ కూడా మేము నిర్వహిస్తున్నాము. సదస్సు జరిగినన్ని రోజులూ ఆహుతులకు రుచికరమైన తెలుగు భోజనంతో విందు ఉంటుంది.
జూలై 5న జరిగే ఉదయపు మరియు మధ్యాహ్న సమావేశాలలో ఎస్. పీ. బాల సుబ్ర మన్యం గారి విలక్షణ కార్యక్రమం "పాడుతా తీయగా ఫైనల్స్" ఉంటుంది, ఇందులో ఫైనలిస్టులు అమెరికా మరియు భారత దేశం వ్యాప్తంగా ఉన్న టెలివిజన్ ప్రత్యక్ష ప్రసార ప్రేక్షకులతో పోటీ పడతారు. అనంత శ్రీరాం, కసిరెడ్డి వెంకట రెడ్డి, సిరివిన్నెల సీతా రామ శాస్త్రి గార్ల వంటి సాహితీ వేత్తల సమావేశాలు, ఇక సాయంత్రం ఉత్తేజపరిచే యువతకు సంబందించిన వివిధ కార్యక్రమాలు, ఉర్రూతలూగించే యూత్ షోలు ఉంటాయి . అంతేకాకుండా, ప్రముఖ సాహితీవేత్త గరికపాటి వారి అష్టావధానం, సిఎమ్ఇ సెమినార్, టాలివుడ్ హీరోయిన్లు ప్రణీత, అంజలి, నిఖిత పటేల్ మరియు దిల్ రాజు కోన వెంకట్ వంటి నిర్మాతలు మరియు దర్శకులు ప్రేక్షకులతో సంభాషించే టాలివుడ్ మీట్ ఉన్నాయి. సాయంత్రపు కార్యక్రమాలలో ప్రఖ్యాత గాయకులు శ్రీరామచంద్ర, మనో, హేమచంద్ర, శ్రావణభార్గవి, బాపు శాస్త్రి, ప్రణవి, మాళవిక ఇంకా మరెందరో పాల్గొనే గొప్ప అంతిమ మ్యూజికల్ ఎక్స్ట్రావగాంజాతో మళ్లీ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇలా పూర్తిస్థాయి వినోద విజ్ఞాన కార్యక్రమాల మేలు కలయికగా రూపొందించిన ఆటా మహాసభలు మీకు జీవితంలో ఒక మరపురాని మధురానుభూతిని మిగులుస్తాయి. మీ మిత్రులు మరియు బంధువులను సందర్శించటంతోపాటు, పూర్తి వినోదంతో నిండిన ఈ మూడు రోజులు, కాన్ఫరెన్సును సాటిలేని ఒక గొప్ప అత్యంత తక్కువ ఖర్చు వెకేషన్ ప్లేస్ గా మార్చుతాయి.
కాన్ఫరెన్సు మరియు హోటల్ వసతికి సంబంధించిన అన్ని వివరాలకు దయచేసి కాన్ఫరెన్సు వెబ్ సైట్ www.ataconference.orgసందర్శించండి. మీరు ఇక్కడికి చేరేటప్పటికి మీ రిజిస్ట్రేషన్ ప్యాకేజి సిద్ధంగా ఉండటానికి వీలుగా మీరు ముందుగానే రిజిస్టరు చేసుకుంటారని మేము విశ్వసిస్తున్నాము. ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ కూడా అందుబాటులో ఉంటుంది, అయితే దాదాపు సామర్థ్యానికి సరిపడేలా ఎక్కువ సంఖ్యలో సభ్యులు పాల్గొనవచ్చని మేము ఊహిస్తున్నాము, కావున ఆన్-సైట్ రిజిస్ట్రేషన్‌ను పరిమిత పరిచే అవకాశాలు ఉన్నందున, మీరందరూ సాధ్యమయినంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా సవినయంగా మనవి చేసుకొంటున్నాను.
మిమ్మల్ని అందరినీ కాన్ఫరెన్సులో చూడటానికి ఎదురు చూస్తున్నాము, ఏదైనా ఇతర సమాచారానికి వెబ్ సైట్ లో ఇచ్చిన సంప్రదింపు నంబర్లలో దేనికైనా ఫోన్ చేయడానికి దయచేసి సంకోచించకండి. మా సంస్థ మరియు దాని కార్యకలాపాలను గురించి మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ www.ataworld.org లేక www.ataconference.org సందర్శించండి
మీ ,
కరుణాకర్ రావు మాధవరం
అధ్యక్షులు, ఆటా